VIDEO: 'మొంథా' తుఫాన్.. సముద్ర తీరం అల్లకల్లోలం

AP: 'మొంథా' తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం గంటకు 12 కి.మీ. వేగంతో ఇది మచిలీపట్నం, కాకినాడ తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో సముద్రపు అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో కాకినాడ దగ్గర ఉప్పాడ, విశాఖపట్నం వద్ద అలల తాకిడికి తీరప్రాంత రోడ్లు ధ్వంసమయ్యాయి. అలల తీవ్రతకు ఉప్పాడ వద్ద రహదారిపై వేసిన బండరాళ్లు కూడా రోడ్డుపైకి పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్