AP: విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలెం వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ పెన్షన్ పంపిణీ కావడంతో కొందరు వృద్ధులు రోడ్డు పక్కన ఉన్న వైన్ షాప్ ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇంతలో ఒకే వ్యక్తి వచ్చి .. ఎందుకు ఇక్కడ ఉన్నారని అడగడంతో పెన్షన్ కోసం ఉదయం నుంచి ఉన్నామని సమాధానమిచ్చారు. అందరినీ వైన్ షాప్ ముందు వేచి ఉండమన్నారంటున్నారని వృద్ధులు ఆరోపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.