AP: గుంటూరు జిల్లా, మంగళగిరిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. NRI ఆసుపత్రి వెనుక ఉన్న రాయల్ పార్క్ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లాట్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కాగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.