AP: మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే. వైసీపీ వాళ్ళు పక్కా ప్లాన్‌తో మామిడికాయలు పారబోశారని కూటమి మంత్రులు మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉన్నారు. పోలీసు విచారణలో బయటపడ్డ వాస్తవాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. కాగా, జగన్ రాకతో బంగారుపాళ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.