VIDEO: మధ్యాహ్న భోజనంలో బల్లి.. విద్యార్థులకు వాంతులు

AP: వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రం హైస్కూల్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలోని పప్పులో బల్లి పడింది. ఆ భోజనం తిన్న ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు వైద్య సిబ్బందిని నేరుగా పాఠశాల వద్దకే రప్పించి చికిత్స అందించడంపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕