VIDEO: లోకేష్ పర్యటనలో ఎమ్మెల్యే దివ్యకు అనుమతి నిరాకరణ

AP: మంత్రి నారా లోకేష్ పర్యటనలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన దివ్యకు జేఎన్టీయూలోకి ప్రవేశం నిరాకరించారు. లోకేష్‌ను కలిసేందుకు వెళ్లిన దివ్యను పోలీసులు మెయిన్ గేటు వద్ద అడ్డుకున్నారు. ఆమె గేటు బయట కారులోనే చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ పర్యటన మీడియాకు దూరంగా, పోలీసుల సమక్షంలోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్