VIDEO: వైసీపీ కార్పొరేటర్లపై దాడికి దిగిన టీడీపీ కార్పొరేటర్లు

AP: విశాఖలో గీతం కాలేజీకి ప్రభుత్వ భూమి కేటాయింపుపై జీవీఎంసీ కౌన్సిల్‌లో తీవ్ర దుమారం రేగింది. మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, టీడీపీ ఎంపీ భరత్ సంస్థకు ఈ భూమిని కేటాయించినట్లు సమాచారం. వైసీపీ కార్పొరేటర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది, ఇందులో వైసీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు గాయపడ్డారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరించి, ముగ్గురు వైసీపీ సభ్యులను సస్పెండ్ చేసి, కౌన్సిల్ నిర్వహించకుండానే వెళ్లిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.

సంబంధిత పోస్ట్