AP: కళ్యాణదుర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాల్లో జరిగిన ఘటనలకు నిరసనగా వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు, బౌన్సర్లు కౌంటింగ్ కేంద్రాల్లో దాడికి పాల్పడ్డారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో కళ్యాణదుర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానికంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. జరిగిన దాడులపై వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.