AP: విజయ డెయిరీ పాల ఉత్పత్తుల ధరను లీటర్పై రూ.2 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ పెంపు వల్ల ప్రజలపై ఏడాదికి రూ.100 కోట్ల భారం పడనుంది. కాగా, ఇటీవల రైతుల నుంచి పాల సేకరణ ధరను కూడా పెంచిన విషయం తెలిసిందే.