బొబ్బిలిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ భూమిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించి, ప్రహరీ గోడ నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావుకు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మునకాల శ్రీనివాస్, సీహెచ్ రాజు, జి. సత్యనారాయణ పాల్గొన్నారు.