తుఫాను బీభత్సం..విజయనగరంలో భారీ వర్షాలు

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో తీరం దాటిన తుఫానుతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సీ హెచ్ బొడ్డవలస సచివాలయం పరిధిలోని వెలగవలస గ్రామంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. పాత ఇళ్లు, పూరి గుడిసెలు దెబ్బతింటే వెంటనే గ్రామ అధికారులకు తెలియజేయాలని, గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 7620300800, 9073850459 అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వెల్ఫేర్ అసిస్టెంట్ శివ, టీడీపీ మండల పార్టీ నాయకులు రెడ్డి సంజీవ్ నాయుడు, సచివాలయం కన్వీనర్ బొంగు త్రినాధ్ పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕