విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాజుపేట, బంకురువలస గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. SASCI నిధులతో బొబ్బిలి–మక్కువ రోడ్డు నుంచి రాజుపేట వరకు రూ. 1. 70 కోట్లతో, స్టేట్ హైవే నుంచి బంకురువలస వరకు రూ. 1. 60 కోట్లతో తారు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.