బొబ్బిలి ప్రాజెక్టు పరిధిలోని 73 అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం అంగన్వాడీ ఉత్సవాలు, పోషణ మహా కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ విజయలక్ష్మి జెండావిది కోరాడవీధి అంగన్వాడీ కేంద్రంలో పాల్గొన్నారు. గంగులవీధి, మల్లమ్మపేట, బర్మాసాల కాలనీ, ఐటీఐ కాలనీ, దేవగుడివీధి తదితర కేంద్రాల్లో కార్యక్రమాలు జరిగాయి. వార్డు పెద్దలు, ఆరోగ్య సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.