మహాకవి గురజాడ అప్పారావు తెలుగు భాషకు వెలుగు జాడ అని నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె. సి. రాజు అన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం 6, 7, 8 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గురజాడ జీవితం, రచనలపై వ్యాసరచన చేపట్టారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్ఎం, ఉపాధ్యాయులు కృష్ణంనాయుడు, ఉదయకుమారి బహుమతులు అందించారు. కన్యాశుల్కం, “దేశమంటే మట్టికాదోయ్” రచనల విశిష్టతను హెచ్ఎం వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.