బొబ్బిలిలో కొండచిలువల కలకలం

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని తారకరామా కాలనీలో లలితమ్మ గుడి, దేశతల్లి గుడి సమీపంలో కొండచిలువలు అధికంగా సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో కొండచిలువలు కనిపించినట్లు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం కొండచిలువల సంచారానికి సంబంధించిన వీడియోను ప్రజల దృష్టికి తెచ్చారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕