బొబ్బిలిలో యువకుడి ఆత్మహత్య

బొబ్బిలి పట్టణంలోని స్వామివారి వీధి పోస్టాఫీస్ సమీపంలోని గ్రూప్ హౌస్‌లో ఆలవెల్లి వెంకట్రావు (31) అనే యువకుడు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య మానస, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్