వెదుళ్లవలసలో విబిజి రామోజీ పథకం పై రైతులకు అవగాహన

గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామంలో గురువారం విబిజి రామోజీ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా 100-125 పని దినాలు, రోజువారి వేతనం రూ. 300-409 వరకు పెంచారని బిజెపి కో కన్వీనర్ ఏం శ్రీనివాసరావు వివరించారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్