చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని వైగాల లావణ్య, రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో 55 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. చిత్తూరులో జూన్ 27, 28, 29 తేదీల్లో జరిగిన ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ స్టేట్ అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ జాతీయస్థాయి ఎంపికలలో ఈ విజయం సాధించింది. లావణ్య బంగారు పతకం పొందడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ లలిత, సిబ్బంది ఆమెను అభినందించారు. జూలై 7, 8 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఆమె ఎంపికైంది.