దత్తిరాజేరులో మూడు మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం

గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గజపతినగరం మండలంలో ఒకటి, దత్తిరాజేరు మండలంలో రెండు మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. జనార్దన రావు శుక్రవారం  తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అక్టోబర్ ఒకటో తేదీలోగా సమర్పించాలన్నారు. దరఖాస్తు రుసుము 3 లక్షలు, ప్రాసెసింగ్ రుసుం 1000 రూపాయలు ప్రభుత్వానికి ఆన్ లైన్ పేమెంట్ లేదా డ్రాఫ్ట్, డిడి రూపంలో చెల్లించాలని చెప్పారు. ఐదో తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులకు మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕