కారు ఢీకొని రైతు మృతి

గజపతినగరం మండలం బూడిపేట గ్రామానికి చెందిన తిమినాని సత్య (71) అనే పాడిరైతు శనివారం సాయంత్రం పాలు అమ్మి సైకిల్ పై ఇంటికి వస్తుండగా, బొండపల్లి మండలం బోడసింగి పేట వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్