గజపతినగరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శుక్రవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయడం తగదని అన్నారు. పి4 పేరుతో వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం శోచనీయమని, వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయాల్సింది పోయి కోట్లు ఖర్చుపెట్టి సీఎం పంపిణీ చేయడం ప్రజాధనం వృధా చేయడమేనని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్