విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం, బొండపల్లిలోని గరుడబిల్లి గ్రామంలో శుక్రవారం ప్రధానమంత్రి మోడీ జన్మదిన సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో సుమారు 100 మంది రోగులకు డాక్టర్ దొగ్గ నాగార్జున, డాక్టర్ స్నేహాలు దంత పరీక్షలు నిర్వహించి, దంత రోగాలు, క్యాన్సర్లపై అవగాహన కల్పించారు. రోగులకు టూత్‌పేస్టులు, డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు దొగ్గ దేవుడుబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కారుపాటి తౌడు తలతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.