బాలికలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా మానసిక వ్యాధి నివారణ నిపుణులు డాక్టర్ దీప్ చందు అన్నారు. పిడి ఆదేశాల మేరకు శనివారం గజపతినగరం మండలంలోని మరుపల్లి కేజీబీవీ లో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన సదస్సు జరిగింది. బాల్య వ్యవహాల వలన జరిగే నష్టాలను సమగ్రంగా వివరించారు. వైద్యాధికారి డాక్టర్ అనూజ్ రాయ్, ఐసిడిఎస్ సూపర్ వైజార్ జానకి, ప్రిన్సిపాల్ హైమ, సోషల్ వర్కర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.