జన సచివాలయం వద్ద హరితరాయబారులు ధర్నా

గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో ఇటీవల తొలగించిన నలుగురు హరితరాయబారులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఆధ్వర్యంలో హరిత రాయబారులు ధర్నా నిర్వహించారు. ఏడేళ్లగా ఎటువంటి రిమార్కు లేకుండా పనిచేస్తున్న వారిని అర్ధాంతరంగా అక్రమంగా తొలగించడం అన్యాయమని, విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్