గణేష్ మండపం వద్ద దీపపు కాంతులు

విజయనగరం, గజపతినగరం ప్రాంతాలలో శ్రీ గణేష్ విగ్రహం వద్ద ఓం, స్వస్తిక్, గణేష్ ఆకారం, శివలింగం ఆకారంలో దీపపు కాంతులు ఆదివారం వెలిగించారు. ఈ దీపపు కాంతులు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, జ్ఞానాన్ని నింపాలని, అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానం, బుద్ధి కలిగించాలని గణేష్‌ను కోరుకుంటూ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎల్. రాంబాబు తెలియజేశారు. శాస్త్రీయంగా వెలిగే దీపం చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని, ఇంట్లో ఉన్నవారి శ్వాస మెరుగ్గా పనిచేస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕