రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాత్రి గజపతినగరంలో ఒక మద్యం దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానం అమలును ఆయన స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మద్యం ఏ ఫ్యాక్టరీలో తయారైందో, ఏ దుకాణం ద్వారా విక్రయించబడిందో సులభంగా తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.