మెంటాడ : కైలాం గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలు

మెంటాడ మండలం కైలాం గ్రామంలో మంగళవారం తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతను, బిడ్డకు అమృతం వంటివని, పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల నుండి రెండేళ్ల వరకు కొనసాగించవచ్చని సూపర్వైజర్ ధనలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్