మెంటాడ మండలం కైలాం గ్రామంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో ఆధ్యాత్మికత శోభాయమానంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిర ప్రతిష్ట పూజా కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు మేళ తాళములతో, వేద మంత్రములతో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.