దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో గెద్ద వారి కుటుంబం ఆధ్వర్యంలో నందెమ్మ చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసంలో దీపావళి రోజున శివపార్వతులతో కూడిన మట్టి నందన్న విగ్రహాలకు చవితి వరకు పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన సంబరంలో భాగంగా గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపు నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకల్లో పాల్గొన్నారు.