మెంటాడలో నందెమ్మ చవితి సంబరాలు ఘనంగా

మెంటాడ మండల కేంద్రంలో శనివారం రాత్రి నందెమ్మ చవితి సంబరాలు వైభవంగా జరిగాయి. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో, దీపావళి రోజున శివపార్వతులతో కూడిన మట్టి నందన్న విగ్రహాలకు చవితి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జన సంబరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ నిమజ్జన ఉత్సవంలో భాగంగా గ్రామంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్