మెంటాడ మండలం జయతి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం 1&2 అంగన్వాడి సెంటర్లో పోషకాహార ప్రదర్శన కార్యక్రమం జరిగింది. పోషకాహార మాసరోత్సవంలో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. బాలింతలు, గర్భిణీలు తదితరులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు దుల్ల మంగ కుమారి, ఎన్ సూరమ్మ, ఆయాలు, పలువురు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.