విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు జానకి ఆధ్వర్యంలో బుధవారం సెక్టార్ స్థాయి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నినాదాలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు చేశారు. ఎస్ లింగాలవలస సెక్టార్ పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.