గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు గజపతినగరం ఎస్. ఐ మహేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. గుర్ల మండలం గరికవలస గ్రామానికి చెందిన గుమ్మడి శంకరరావు ఇసుకను తరలిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్లలు తీసుకుంటామని హెచ్చరించారు