జాతీయ రహదారిపై లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం లారీ ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు గజపతినగరం ఎస్. ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీను (38) ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్