విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి రామతీర్థం జంక్షన్ కారుకొండ వీధిలో ఆదివారం వినాయక విగ్రహం వద్ద మహిళలు దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మహిళలు ఓంకారం, స్వస్తిక్, శివలింగం ఆకారాల్లో దీపాలను అందంగా తీర్చిదిద్ది, భక్తిశ్రద్ధలతో గణపతికి దీపారాధన చేశారు.