తుఫాను ప్రభావంతో అంధకారంలో నెల్లిమర్ల నగరం

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీని కారణంగా రాత్రి అంతా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో నెల్లిమర్ల నగరం అంధకారంలో మునిగిపోయింది. తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు వీయడంతో, ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో నగరవాసులు రాత్రంతా విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕