ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తున్న సేవ సంకల్ప్ అభియాన్"లో భాగంగా విజయనగరం ఈస్ట్ మండలం 5వ వార్డులోని నవాబుపేట అంగన్వాడీ సెంటర్-2లో అంగన్వాడీ కార్యకర్తలను జిల్లా మహిళా మోర్చా శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు వై. స్మిత మాట్లాడుతూ చిన్నారుల పోషణ, విద్య, ఆరోగ్యం కోసం అంగన్వాడీ సేవలను అందరూ గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ భూపతిరాజు హర్షవర్ధని, మండకుర్తి రేవతి, ఈస్ట్ మండల అధ్యక్షులు రాంబాబు, చింతాడ రాజేష్ పాల్గొన్నారు.