మహాకవి గురజాడ వెంకట అప్పారావు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చి, ఆయన గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రతీ పాఠశాలలో గురజాడ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నవయుగ వైతాళికులు గురజాడ 162వ జయంతోత్సవం కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు.