గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత సేవలో ఎస్బీఐ

మహాత్మా గాంధీ జయంతినీ పురస్కరించుకుని విజయనగరంలో పెద్ద చెరువు గట్టు వద్ద" స్వచ్ఛత హి సేవ -2026 "కార్యక్రమాన్ని ఎస్ బీ ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. చెరువు గట్టు పరిసరాలలో పేరుకుపోయిన చెత్తాను, వ్యర్థాలను, ఎస్ బీ ఐ అధికారులు, సిబ్బంది స్వయంగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని ఎస్ బీ ఐ శాఖలకు చెందిన సిబ్బందితోపాటు ఎస్. బీ. ఐ. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విజయనగరం కు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕