విజయనగరం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడిగా సివివో అధ్యక్షుడు పి. సుధా బ్రహ్మనాయుడు నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ఐ. ఏ. ఎస్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ మండలిలో జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్‌జీవో నుంచి సుధా బ్రహ్మనాయుడిని సభ్యుడిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో మండలి పనిచేయనుంది.