9విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వెలుగు

బొబ్బిలి పట్టణంలోని తారకరామా కాలనీలో ఉన్న డిపిఈపీ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం చిట్టి మోజు ఉషారాణి ఆధ్వర్యంలో 'డిస్కవర్ మీ' కార్యక్రమం నాలుగో రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, మొదటి సెషన్‌లో శాస్త్రీయ సంగీతంలోని స్వరాలు, వీణ వాయిద్య పరిచయం చేశారు. సంగీతం అవసరాన్ని టీచర్ కరుణ వివరించారు. రెండో సెషన్‌లో అరుణ కుమారి పేపర్, స్పాంజ్ పెపెట్రీ తయారీని పిల్లలతో చేయించారు. టౌన్ సీఐ కే. నారాయణ రావు విద్యార్థులకు సందేశమిచ్చారు. అనంతరం అతిథులకు మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందర్ రావు, టీ భద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్