బొబ్బిలి గోకుల్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు ర్యాగింగ్, మత్తు పదార్థాలు, డిజిటల్ అరెస్టులు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సీఐ కింతలి నారాయణరావు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, విద్యపై దృష్టి సారించి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.