బాడంగి: 'పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి'

పంచాయతీలకు నిధులు లేవు, కేంద్ర బృందాల సందర్శనలు మాత్రం పెరుగుతున్నాయి అని బాడంగి మండలం గజరాయునివలన ఎంపీటీసీ పాలవలస గౌరు అన్నారు. శనివారం ఎరుకులపాకలో మాట్లాడుతూ, నిధుల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. లక్ష్మీపురం పంచాయతీని ఏడాదిలో 10 బృందాలు సందర్శించాయని, దీంతో స్థానికంగా ఖర్చులు భరించాల్సి వస్తోందన్నారు. నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్