బొబ్బిలిలోని సిరిపురపువీధిలో సోమవారం ఎలక్ట్రిక్ స్కూటీ పేలింది. రమేశ్ అనే వ్యక్తి తన స్కూటీని పార్క్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. మంటలు పక్కనే ఉన్న మరో స్కూటీకి వ్యాపించడంతో రెండూ దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. స్థానికులు మంటలను వెంటనే ఆర్పేశారు.