బొబ్బిలి: సిద్దు సైకిల్ పై ఎమ్మెల్యే షికారు

తెర్లాం మండలం జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్దు రూపొందించిన వినూత్న బ్యాటరీ సైకిల్‌ను ఎమ్మెల్యే బేబినాయన ఆదివారం అభినందించారు. ప్రోత్సాహకంగా రూ.20 వేలు అందించి, సైకిల్పై కొద్దిసేపు కోటలో ఊరేగారు. అనంతరం సిద్ధు గ్రామ చెరువు కింద ఉన్న 40 ఎకరాల ఆయకట్టుకు రెండు సోలార్ బోర్లు ఏర్పాటు చేయాలంటూ చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్