బొబ్బిలి: పట్టణ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్విఎస్ ప్రకాష్

బొబ్బిలి పట్టణ ఎస్‌ఐగా ఎన్. వి. ఎస్ ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పని చేస్తున్న బదిలీపై బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు.

సంబంధిత పోస్ట్