బ్యాటరీ సైకిల్ తయారు చేసిన సిద్ధూని ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ఆదివారం బొబ్బిలి కోటలో అభినందించి, కొంత ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో చెరువు ఆధారంగా సాగు జరుగుతోందని, సోలార్ మోటార్లు ఏర్పాటు చేయాలని సిద్ధూ ఎమ్మల్యేను కోరాడు. దీంతో తొందరలోనే సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే బేబీ నాయన హామీ ఇచ్చారు. కాగా, సిద్ధూను గతంలో పవన్ కళ్యాణ్ అభినందించిన విషయం తెలిసిందే.