బొబ్బిలి మండలం పిరిడి బీసీ బాలుర వసతి గృహంలో శనివారం జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా డాక్టర్ రఘు వంశీ సూచనలతో హెల్త్ సూపర్వైజర్ సింహాచలం డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.