బొబ్బిలి: పట్టణం బాట పట్టిన పల్లె జనం

బొబ్బిలి పట్టణంలో ఆంజనేయ స్వామి కోవెల నుండి బజార్ వరకు భారీ వాహనాలతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. శ్రావణ మాసం సందర్భంగా రేపు శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాలకు కావలసిన సామాగ్రి కొనుగోలు చేయుటకు పల్లెల నుండి గురువారం సాయంత్రం భారీ స్థాయిలో తరలివచ్చారు. పుష్పాలు, పండ్లు, తోరణాలు, గంధాలు, దీపాలు, ధూపాలు, నైవేద్య పదార్థాలు వంటి పూజా అవసరాలు కొనుగోలు చేయడానికి బజార్లు జనంతో కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్