బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి సమీపంలో సాగునీటి కాలువలో పడి బొబ్బిలి మండలం ఎం.బూర్జవలస గ్రామానికి చెందిన పిట్ట అప్పలనాయుడు (36) మృతి చెందాడు. తిరుపతి నుంచి వస్తూ రైలులో గందరగోళంతో కుటుంబ సభ్యుల నుంచి వేరుపడ్డాడు. అనంతరం ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, రావులపాలెం పోలీస్ పరిధిలో కాలువలో మృతదేహం లభించింది. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.